AP Mee Mart: అక్టోబర్ 1 నుండి 1000 మీ మార్ట్‌ స్టోరులు ప్రారంభం

AP Mee Mart Launch: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కిరాణా ఖర్చులు తగ్గించేందుకు కొత్త చొరవ తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మీ మార్ట్‌లు ఏర్పాటు చేయనుంది. ఇవి డీమార్ట్‌లాంటి కాన్సెప్ట్‌తో నడుస్తాయి. అక్టోబర్ ఒకటో తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు.

--Advertisement--

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ సహకారంతో ఈ కేంద్రాలు రావని ఆయన చెప్పారు. ఇప్పటికే 870 దుకాణాలు సిద్ధమయ్యాయి. మిగతా 130 కూడా త్వరలో పూర్తవుతాయి.

NTR Bharosa Pension Last Date
NTR Bharosa Pension: నేటితో ముగుస్తున్న కొత్త పెన్షన్ దరఖాస్తు గడువు
minister-nadendla-manohar
minister-nadendla-manohar

మీ మార్ట్‌లు మార్కెట్ ధరల కంటే తక్కువకే నాణ్యమైన సరుకులు అందిస్తాయి. తొలుత 64 రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయి. నూనెలు, బియ్యం, పప్పులు వంటివి ఒకే చోట లభిస్తాయి. కల్తీ లేని ఉత్పత్తులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది.

మధ్యవర్తుల కమీషన్లు తగ్గించి ఆ లాభాన్ని డిస్కౌంట్ రూపంలో వినియోగదారులకు అందించాలని ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఈ నెట్‌వర్క్ విస్తరిస్తుంది. ‘మీ మార్ట్‌ – నీది నాది మనందరిది’ అనే నినాదంతో సేవలు అందుతాయి.

Telangana Paddy Bonus (1)
Paddy Farmers: సన్న వడ్ల రైతులకు సెప్టెంబర్ 17 వరకు అవకాశం

పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సన్నబియ్యాన్ని మార్కెట్ ధర కంటే కిలోకు పది రూపాయలు తక్కువగా అమ్ముతోంది. మీ మార్ట్‌లు ఈ క్రమంలో మరో ముందడుగు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment