AP Assigned Land Registration: రూ.100కే వారసులు పేరు మార్చుకోవచ్చు

AP Assigned Land Registration: ఆంధ్రప్రదేశ్‌లో ఎసైన్డ్ భూముల వారసులకు గొప్ప సౌకర్యం లభించింది. ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ద్వారా వారసులు తమ పేరుపై భూమిని సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు జస్ట్ రూ.100 మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి అమలులోకి వచ్చింది.

--Advertisement--

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

ఇక ముందు వారసత్వ మ్యుటేషన్ కోసం తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రార్ కార్యాలయంకు నేరుగా వెళ్లి భాగా పరిష్కార రిజిస్ట్రేషన్ చేయవచ్చు. గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే పాత విధానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.

ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే స్టాంప్ డ్యూటీ రూ.100 మాత్రమే. 10 లక్షలు దాటితే రూ.1000 చెల్లించాలి. ఇది చాలా మంది చిన్న భూమి యజమానులకు ఉపయోగకరంగా ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. యజమాని మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ పత్రాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే, తాసిల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్ స్వయంచాలకంగా జరుగుతుంది. అధికారుల వద్ద పలుమార్లు తిరగాల్సిన ఇబ్బంది తొలగింది.

PM Laghu Vyapari Mandhan Yojana Pension
PMLVMY: చిన్న వ్యాపారులకు నెలకు 3000 పెన్షన్… దరఖాస్తు విధానం

అయితే ఈ ఎసైన్డ్ భూములను 20 సంవత్సరాల వరకు అమ్మకం చేయడానికి అనుమతి లేదు. ఈ నిబంధన కచ్చితంగా పాటించాలి.

ఈ కొత్త విధానం భూమి వారసులకు చాలా ఉపయోగకరంగా మారనుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి. అర్హులైన వారు త్వరగా సంబంధిత కార్యాలయాలను సంప్రదించి ప్రయోజనం పొందాలి.

AP Assigned Land Registration (FAQ)

AP Assigned Land Registration కోసం ఎంత ఖర్చు అవుతుంది?

ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే రూ.100 మాత్రమే. 10 లక్షలు దాటితే రూ.1000 చెల్లించాలి.

ఎసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి?

నేరుగా రిజిస్ట్రార్ కార్యాలయంలో భాగా పరిష్కార రిజిస్ట్రేషన్ చేయవచ్చు. తాసిల్దార్ కార్యాలయం వెళ్లాల్సిన అవసరం లేదు.

NTR Bharosa Pension Last Date
NTR Bharosa Pension: నేటితో ముగుస్తున్న కొత్త పెన్షన్ దరఖాస్తు గడువు
ఎసైన్డ్ భూములను ఎప్పుడు అమ్మవచ్చు?

20 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే అమ్మకానికి అనుమతి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ కోసం ఏ పత్రాలు అవసరం?

యజమాని మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మరియు ఇతర సంబంధిత దస్తావేజులు అవసరం.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment