AP Anganwadi Recruitment 2025: ఏపీలో టీచర్ & హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఈ నెలాఖరు లోపు అప్లై చేయండి

AP Anganwadi Recruitment 2025: శ్రీ సత్యసాయి జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 69 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి పాసైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. చివరి తేదీ డిసెంబర్ 30, 2025.

--Advertisement--

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

AP Sri Sathyasai Anganwadi Recruitment 2025 ముఖ్యమైన తేదీలు

వివరణతేదీ
దరఖాస్తు ప్రారంభండిసెంబర్ 22, 2025
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 30, 2025 (సాయంత్రం 5 గంటల వరకు)

అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF

శ్రీ సత్యసాయి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు సహాయకుల నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి క్రింది లింక్‌లో అధికారిక వెబ్‌సైట్ చూడండి.

ESIC Aadhaar Link
ESIC Aadhaar Link ఇప్పుడు తప్పనిసరి – ఇంట్లోనే చేసుకోండి

అధికారిక నోటిఫికేషన్: https://srisathyasai.ap.gov.in/notice/notification-regarding-recruitment-of-anganwadi-workers-and-helpers-in-12-icds-projects-of-sri-sathya-sai-district/

అర్హతలు & ఖాళీల వివరాలు

పోస్టు పేరుమొత్తం ఖాళీలువిద్యా అర్హతవయసు పరిమితి (01.07.2025 నాటికి)ఇతర అర్హతలు
అంగన్‌వాడీ టీచర్ (కార్యకర్త)1110వ తరగతి పాస్21 నుంచి 35 సంవత్సరాలుమహిళలు మాత్రమే, వివాహితులు, స్థానిక నివాసం (అంగన్‌వాడీ కేంద్రం గ్రామంలో)
అంగన్‌వాడీ హెల్పర్ (సహాయక)5810వ తరగతి పాస్21 నుంచి 35 సంవత్సరాలుమహిళలు మాత్రమే, వివాహితులు, స్థానిక నివాసం

ప్రాజెక్టు వారీగా ఖాళీలు:

  • బత్తలపల్లి: 3
  • సీకే పల్లి: 6
  • ధర్మవరం: 2
  • గుడిబండ: 2
  • హిందూపూర్: 13
  • కడిరి: 6
  • మడకసిర: 7
  • నల్లచెరువు: 3
  • ఓడీ చెరువు: 2
  • పెనుకొండ: 6
  • పుట్టపర్తి: 6
  • సోమందేపల్లి: 9

ఎంపిక ప్రక్రియ

దశవివరణ
మెరిట్ ఆధారంగా10వ తరగతి మార్కులు, ఇతర ధృవపత్రాల ఆధారంగా మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు
డాక్యుమెంట్ వెరిఫికేషన్అర్హతలు పరిశీలన
ఫైనల్ సెలెక్షన్మెరిట్ & వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు

జీతం / గౌరవ వేతనం 2025

పోస్టునెలవారీ గౌరవ వేతనం
అంగన్‌వాడీ టీచర్ (కార్యకర్త)రూ. 11,500
అంగన్‌వాడీ హెల్పర్ (సహాయక)రూ. 7,000

దరఖాస్తు చేసే విధానం

ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ సౌకర్యం లేదు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.

LPG e-KYC Deadline Extension
LPG e-KYC గడువు సెప్టెంబర్ 14 వరకు పొడిగింపు

“దరఖాస్తు చేసేందుకు క్రింది దశలు అనుసరించండి:”

  • సంబంధిత సీడీపీఓ (చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్) కార్యాలయంలో ఖాళీ అప్లికేషన్ ఫారం తీసుకోండి.
  • ఫారంను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లు జత చేయండి.
  • ఫోటో అతికించి, సంతకం చేయండి.
  • డిసెంబర్ 30, 2025 సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించండి.
  • రసీదు తప్పనిసరిగా తీసుకోండి.

అవసరమైన డాక్యుమెంట్లు:

  • 10వ తరగతి మార్కుల మెమో
  • పుట్టిన తేది ధృవీకరణ పత్రం
  • నివాస ధృవపత్రం / ఆధార్ కార్డు
  • కుల ధృవపత్రం (అవసరమైతే)
  • వికలాంగ ధృవపత్రం (అయితే)
  • ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

ముఖ్యమైన లింకులు

వివరణలింక్
అధికారిక నోటిఫికేషన్Click here
అధికారిక వెబ్‌సైట్https://srisathyasai.ap.gov.in/

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment