MeeBhoomi AP Aadhaar Seeding: స్టెప్ బై స్టెప్ పూర్తి గైడ్ – ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయండి

MeeBhoomi AP Aadhaar Seeding: ఆంధ్రప్రదేశ్‌లో భూమి రికార్డులు ఇప్పుడు పూర్తిగా డిజిటల్ రూపంలో ఉన్నాయి. MeeBhoomi పోర్టల్ ద్వారా మీ 1B, అడంగల్, ఎఫ్‌ఎంబి వివరాలు ఎప్పుడైనా చూడవచ్చు. కానీ ఈ రికార్డులన్నీ మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఇదే MeeBhoomi AP Aadhaar Seeding. ఈ లింకింగ్ లేకపోతే రైతు భరోసా, ఈ-క్రాప్, పాస్‌బుక్ వంటి ప్రభుత్వ సేవలు సజావుగా రావు. కాబట్టి మీ స్టేటస్ ఇప్పుడే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

--Advertisement--

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

ఆధార్ సీడింగ్ అంటే ఏమిటి? ఎందుకు అవసరం?

మీ భూమి వివరాలను ఆధార్‌తో జత చేయడమే ఈ సీడింగ్. దీని వల్ల భూమి మీద ఇతరులు తప్పుడు హక్కులు చెప్పలేరు. డూప్లికేట్ రికార్డులు రావు. ప్రభుత్వ పథకాల వెరిఫికేషన్ చాలా సులభం అవుతుంది. మీ భూమి యాజమాన్య రుజువు కూడా మరింత బలంగా మారుతుంది.

ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

ముందుగా https://meebhoomi.ap.gov.in వెబ్‌సైట్‌ని తెరవండి. మీ మొబైల్ నంబర్‌తో OTP ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మాత్రమే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.

హోమ్ పేజీలో Aadhaar / Identity Seeding సెక్షన్‌కి వెళ్లి Landowner Aadhaar Seeding Statusపై క్లిక్ చేయండి.

adhaar seeding
adhaar seeding image credits: meebhoomi.ap.gov.in

ఇక్కడ మీ జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి. తర్వాత సర్వే నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా ఆధార్ నంబర్ ఏదైనా ఒకటి టైప్ చేసి Get Details నొక్కండి.

AP 22A Land Rules New GO
AP 22A Land Rules 2026 | 1954 పూర్వ అసైన్డ్ భూములు 22A జాబితా నుంచి తొలగింపు!

స్క్రీన్ మీద మీ ఫలితాలు కనిపిస్తాయి – Aadhaar Linked అని YES లేదా NO, యజమాని పేరు, భూమి రకం, చివరి అప్‌డేట్ తేదీ కూడా చూడవచ్చు.

ఆధార్ లింక్ అయితే ఏమవుతుంది?

“Aadhaar Successfully Seeded” అని వచ్చినట్లయితే మీరు పూర్తి సేఫ్. ఎలాంటి సమస్యలు ఉండవు.

లింక్ కాలేదంటే ఏం చేయాలి?

“Aadhaar Not Seeded” అని వస్తే దగ్గరలోని మీసేవా కేంద్రంకి వెళ్లండి. ఆధార్ కార్డు, ల్యాండ్ పాస్‌బుక్ జెరాక్స్ కాపీలు ఇవ్వండి. వారు సీడింగ్ పూర్తి చేస్తారు. 1 నుంచి 3 వర్కింగ్ డేస్లో అప్‌డేట్ అవుతుంది.

కావాల్సిన డాక్యుమెంట్లు

డాక్యుమెంట్అవసరం
Aadhaar Cardతప్పనిసరి
Ration Card / Mobile Numberఅవసరం
Land Passbookతప్పనిసరి
1B / Adangal Copyఆప్షనల్

MeeBhoomiలో ఇతర ఉపయోగకరమైన సేవలు

ఈ పోర్టల్‌లో మీరు అడంగల్, విలేజ్ మ్యాప్, 1B, మ్యుటేషన్ స్టేటస్, ల్యాండ్ డిస్ప్యూట్ స్టేటస్ వంటివి కూడా చెక్ చేసి PDFగా సేవ్ చేసుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం సాధారణ ఉద్దేశ్యం కోసం మాత్రమే. ఆర్థిక లేదా భూమి సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించండి.

Talli Ki Vandanam Cyber Fraud
Talliki Vandanam Alert: ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి

Frequently Asked Questions

MeeBhoomi AP Aadhaar సీడింగ్ ఆన్‌లైన్‌లో చేయవచ్చా?

లేదు. స్టేటస్ మాత్రమే ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. పూర్తి లింకింగ్ మీసేవా కేంద్రం ద్వారా మాత్రమే జరుగుతుంది.

Aadhaar సీడింగ్ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా 1 నుండి 3 వర్కింగ్ డేస్‌లలో అప్‌డేట్ అవుతుంది.

Aadhaar లింక్ కాలేదంటే ఏ సమస్యలు వస్తాయి?

రైతు భరోసా సహాయం, E-Crop వెరిఫికేషన్, పాస్‌బుక్ సేవలు అడ్డంకులు ఎదురవుతాయి. భూమి సంబంధిత డిస్ప్యూట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

Aadhaar లింక్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి?

MeeBhoomi అధికారిక వెబ్‌సైట్‌లో Aadhaar Seeding Status ఆప్షన్ ఉపయోగించి వెంటనే చూడవచ్చు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment